Heart Attack : చూస్తూనే ఉన్నాం కదా.. ప్రతి రోజు పేపర్లలో, టీవీలలో, మన ఇంటి పక్కనో, రోడ్డు మీదనో ఎవరో ఒకరు సడెన్ గా కింద పడిపోవడం చూస్తుంటాం. ఒక్కసారిగా కుప్పకూలిపోవడం చూస్తుంటాం. అసలు జనాలు ఎందుకు ఇలా కిందపడిపోతున్నారు అంటే.. దానికి కారణం హార్ట్ ఎటాక్. ఇది ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎవరికి వస్తుందో చెప్పలేం. హార్ట్ ఎటాక్ అనేది అందరికీ కామనే కానీ.. అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. దాని వల్ల ఉన్నపళంగా కుప్పకూలిపోతున్నారు జనాలు.
ప్రస్తుతం మారుతున్న జీవన విధానమే గుండె నొప్పులకు, గుండె పోటులకు ప్రధాన కారణాలు. జీవన విధానాల్లో మార్పులు చేసుకోకపోతే గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే.. ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో చెప్పలేం. ముఖ్యంగా వ్యాయామం చేయకపోవడం, సరైన నిద్రలేకపోవడం, సమయానికి తినకపోవడం, రాత్రిళ్లు మేల్కోవడం, ఎక్కువగా స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోవడం, ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, నడవకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, హార్ట్ అటాక్ వస్తుంది. నిజానికి హార్ట్ అటాక్ వస్తే మనిషి చనిపోడు. కానీ.. సమయానికి ట్రీట్ మెంట్ అందకపోతే మాత్రం అది గుండె ఫెయిల్యూర్ కు దెబ్బ తీసి అప్పుడు మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది.
Heart Attack : హార్ట్ ఎటాక్ రాగానే ఏం చేయాలి?
చాలామందికి హార్ట్ ఎటాక్ రాగానే ఏం చేయాలో తెలియదు. హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తిని ముందు వెలికిలా పడుకోబెట్టి.. గాలి ఆడేలా చేయాలి. ఆ తర్వాత చాతి మీద గుండె ఉండే భాగం మీద చేతులతో గట్టిగా నొక్కాలి. వీలైతే గట్టిగా బాదాలి. అలా ఒక రెండు మూడు నిమిషాలు చేస్తే.. కుప్పకూలిపోయిన వాళ్లు స్పృహ లోకి వస్తారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలకు ఏం ప్రమాదం ఉండదు. హార్ట్ ఎటాక్ రాగానే ఇలా గుండె మీద నొక్కడాన్ని సీపీఆర్ అంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏదైనా అడ్డుకుంటే అప్పుడు గుండెకు రక్తసరఫరా కాదు. దీంతో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అప్పుడే జనాలు ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. అదే సమయంలో సీపీఆర్ చేస్తే గుండె తిరిగి కొట్టుకునే అవకాశం ఉంటుంది.