SrihariKota : ప్రస్తుతం ఇండియాలోనే కాదు.. ప్రపంచమంతా చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటోంది. దానికి కారణం చంద్రుడి మీద ఉన్న దక్షిణ దృవం మీద విక్రమ్ ల్యాండర్ ను దింపడం. ఇప్పటి వరకు సౌత్ పోల్ మీద ఏ దేశం కూడా అడుగు పెట్టలేదు. దక్షిణ దృవం మీద అడుగు పెట్టిన తొలి దేశం ఇండియా. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు మన దేశం గురించి మాట్లాడుకుంటున్నాయి. అయితే.. ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఇస్రో ఎక్కువగా ముఖ్యమైన రాకెట్లను ఏపీలో ఉన్న శ్రీహరికోట నుంచి మాత్రమే పంపిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు.
నిజానికి ఇస్రోకు మూడు లాంచింగ్ సెంటర్లు ఉన్నాయి. అందులో ఒకటి కేరళలో తిరువనంతపురంలో ఉంది. దాని పేరు విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్. రెండోది శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్. మూడోది ఒడిషాలోని భద్రక్ లో ఉన్న డాక్టర్ అబ్దుల్ కలామ్ ఐలాండ్ లో ఉంది. మూడు స్పేస్ లాంచింగ్ సెంటర్స్ ఉన్నా కూడా ఇస్రో ఎక్కువగా ఏపీలోని శ్రీహరికోట నుంచే రాకెట్లను లాంచ్ చేస్తూ ఉంటుంది. చంద్రయాన్ 3ని కూడా శ్రీహరికోట నుంచే లాంచ్ చేసింది ఇస్రో. దానికి కారణాలు చాలా ఉన్నాయి.
SrihariKota : ఇస్రో శ్రీహరికోటనే ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఇవే
ఇస్రో రాకెట్స్ లాంచ్ కోసం శ్రీహరికోటనే ఎంచుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే అని చెప్పుకోవచ్చు. అన్ని రాకెట్లు కాదు కానీ.. 90 శాతం రాకెట్లు, ముఖ్యమైన ప్రయోగాలు అన్నీ శ్రీహరికోట నుంచే జరుగుతాయి. భూమి గుండ్రంగా తిరుగుతుంది అని తెలుసు కదా. అది వెస్ట్ నుంచి ఈస్ట్ కి రొటేట్ అవుతూ ఉంటుంది.
ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్న శ్రీహరికోట నుంచి రాకెట్లను లాంచ్ చేస్తే ఎలాగూ భూమి కూడా వెస్ట్ వైపు రొటేట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ప్రయోగం చేస్తే దాంట్లో వాడే ఫ్యుయెల్ ఖర్చు భారీగా తగ్గుతుంది. శ్రీహరికోట ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటుంది. దాని వల్ల అక్కడ హైమూమెంటమ్ ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి రాకెట్లను లాంచ్ చేస్తే మామూలుగా వేరే ప్లేస్ లో లాంచ్ చేసినప్పుడు వాడే ఇంధనం కంటే కూడా ఇక్కడ లాంచ్ చేసినప్పుడు ఇంధనం ఖర్చు తక్కువ అవుతుంది. రాకెట్ ఇంధన ఖర్చు తగ్గించి ఆకాశంలోకి పంపించాలంటే దానికి శ్రీహరికోట బెస్ట్ ఆప్షన్.
మరో కారణం ఏంటంటే.. ఒకవేళ రాకెట్ ఫెయిల్ అయితే దానికి సంబంధించిన శకలాలు భూమి మీద పడకుండా.. అవి సముద్రంలో పడేలా చేసేందుకే శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తుంటారు. శ్రీహరికోట పక్కనే బే ఆఫ్ బెంగాల్ ఉండటం వల్ల.. ఒకవేళ రాకెట్ ఫెయిల్ అయినా కూడా శ్రీహరికోట పక్కనే ఉన్న సముద్రంలో ఆ శకలాలు పడేలా చేస్తారు సైంటిస్టులు.