Lines on Car glasses : మీరు ఎప్పుడైనా కారు వెనుక భాగంలో ఉండే అద్దాన్ని గమనించారా? కారు అద్దం వెనుక భాగంలో కొన్ని గీతలు ఉంటాయి. వాటిని పరీక్షించి చూస్తేనే తెలుస్తుంది. ఆ అద్దం మీద గీతలు ఉన్నాయని. అయితే.. ఇది న్యూ జనరేషన్. టెక్నాలజీ జనరేషన్. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ జనరేషన్ లో అన్నీ టెక్నాలజీతో ముడి పడి ఉన్నాయి. ఇప్పుడు అంటే కార్లు గట్రా ఉన్నాయి కానీ.. ఒక 50 ఏళ్ల కింద కార్లు ఎక్కడివి. ఎక్కడో ఒక చోట కనిపించేవి.
ధనవంతులు ఇళ్ల ముందు మాత్రమే కార్లు ఉండేవి. బైక్సే లేవు అప్పుడు. కానీ.. ఇప్పుడు ఇంటికో కారు ఉంది. అసలు సైకిళ్లు కూడా లేని కాలంలో ఎద్దుల బండి, గుర్రాల బండి మీదనే ప్రయాణాలు చేసేవారు. ఏదైనా ఊరికి వెళ్లాలంటే రోజులు గడిచేది. కానీ.. ఇప్పుడు విమానంలో వేరే దేశం కూడా ఒకే రోజులో వెళ్లి రావచ్చు.
నిజానికి కంఫర్ట్ ప్రయాణం అంటే కారు అనే చెప్పుకోవచ్చు. ఎంత దూరం వెళ్లినా ప్రయాణం చేసినట్టే అనిపించదు. అలసట కూడా రాదు. అందుకే కారును లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ గా చెబుతుంటారు. అయితే.. కారు వెనుక అద్దం మీద ఉండే గీతలకు ఒక అర్థం ఉంది. వాటిని డీఫాగర్స్ అంటారు. అంటే.. అవి ఎలక్ట్రికల్ గీతలు అన్నమాట.
Lines on Car glasses : ఎలక్ట్రికల్ గీతలకు, కారు అద్దానికి సంబంధం ఏంటి?
ఇవి ఎలక్ట్రికల్ గీతలు అని చెప్పుకున్నాం కదా. వాటికి, అద్దానికి ఏంటి సంబంధం అంటారా? సంబంధం ఉంది. ఎందుకంటే.. వాటి నుంచి కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ అంటే ఏదో హై ఓల్టేజ్ కరెంట్ అనుకునేరు. చాలా తక్కువ ఓల్టేజ్ తో పాస్ అవుతుంది. ఆ గీతలలో కరెంట్ పాస్ అయ్యేలా ఎలక్ట్రికల్ డీఫాగర్స్ ను ఏర్పాటు చేస్తారు.
వాటి వల్ల కారు అద్దం మీద ఏదైనా దుమ్ము దూళి, తేమ, మంచు లాంటివి పడితే అది వెంటనే క్లియర్ అయిపోతుంది అన్నమాట. దాని వల్ల కారు అద్దాలు క్లియర్ గా కనిపిస్తాయి. ఇది వెనుక వచ్చే వాహనాలకు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాత్రి పూట.. కారు అద్దాలు క్లియర్ గా వెనుక వచ్చే వాహనాలకు కనబడి.. ఆ వాహనం లైట్.. అద్దం మీద పడి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. దాని కోసమే.. ఈ గీతలను కారు వెనుక అద్దానికి అమర్చుతుంటారు.