Sudden Rains : చూస్తున్నారు కదా. గత నెల రోజుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అకాల వర్షాలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. చలికాలం పూర్తయి ఎండాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వర్షాలు వెంటాడుతున్నాయి. మే నెల అంటేనే ఎండ బుసలు కొట్టాలి. దంచి కొట్టాలి. బయట అడుగు పెట్టనీయకూడదు. కానీ.. ఇప్పటికీ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల 50 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ కొడుతోంది. మరికొన్ని చోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి వాతావరణాన్ని ఇప్పటి వరకు చూడలేదు.
సాధారణంగా ఎండాకాలంలో ఒక రెండు మూడు రోజులు అకాల వర్షాలు, వడగండ్ల వాన పడుతుంది కానీ.. ఇంతలా కంటిన్యూగా పడటం మాత్రం ఇదే తొలిసారి. దీని వల్ల ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈ అకాల వర్షం. ఇలాగే ఇంకో నెల రోజులు వార్షాలు పడితే అసలు ఈ సారి ఎండాకాలం ఉండే చాన్సే లేదంటున్నారు నిపుణులు.
Sudden Rains : మే నెలలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి
సాధారణంగా మే నెలలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి. కానీ.. ఈ సంవత్సరం 40 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దానికి కారణం వాతావరణంలో చోటు చేసుకునే మార్పులు. ఇవే కాదు.. ఇంకా కొత్త మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి వాతావరణ పరిస్థితులు కేవలం ఏపీ, తెలంగాణలోనే కాదు.. నార్త్ ఇండియాలోనూ చోటు చేసుకుంటున్నాయి. సౌత్ ఇండియాలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వర్షాకాలంలో పడాల్సిన వాన.. వేసవిలోనే సాధారణం కంటే ఎక్కువగా పడింది. ఎండాకాలంలోనే సగం వర్షాలు పడిపోయాయి. దీని వల్ల రైతులు తమ పంటలను నష్టపోవాల్సి వచ్చింది.
ఇలాంటి పరిస్థితులకు కారణం.. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం, అడవులను నరికేయడం, ప్లాస్టిక్ వాడకం పెరగడం, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కారణాలుగా చెబుతున్నారు పర్యావరణవేత్తలు. చెట్లను నరికేయడం, ఎక్కడ చూసినా కాలుష్యం కోరలు చాచడం, గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలే ఇలాంటి వాతావరణ పరిస్థితులకు కారణాలు అవుతున్నాయని.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఇంకా పెరుగుతాయి తప్పితే తగ్గవని హెచ్చరిస్తున్నారు.