Toilet Seats : ఇది చాలామందికి తెలిసిన విషయమే. అంటే.. టాయిలెట్ సీట్లు తెల్లగా ఉంటాయని తెలుసు కానీ.. ఎందుకు తెల్లగా ఉంటాయి అనే విషయం చాలామందికి తెలియదు. మన దగ్గరే కాదు.. విదేశాల్లో కూడా టాయిలెట్ సీట్లు తెల్ల రంగులోనే ఉంటాయి. మన దేశంలో ఇండియన్ టైప్ తో పాటు ఇప్పుడు ఎక్కువగా వెస్టర్న్ టైప్ టాయిలెట్ సీట్లను కూడా వినియోగిస్తున్నారు. చాలామందికి ఈ మధ్య మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు వస్తుండటం వల్ల.. వెస్టర్న్ టాయిలెట్ ను చాలా మంది వినియోగిస్తున్నారు.
అయితే.. ఏ టాయిలెట్ సీటు అయినా సరే.. అది దాదాపు తెలుపు రంగులోనే ఉంటుంది. దానికి కారణం ఏంటి అనేది మాత్రం చాలామందికి తెలియదు. నిజానికి.. టాయిలెట్ సీట్లను పొర్సిలెయిన్ అనే సెరామిక్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఆ మెటిరియల్ తెలుపు రంగులో ఉంటుంది. వేరే రంగులు కలిపి దాన్ని వేరే రంగులో మార్చి తయారు చేయొచ్చు కానీ.. అప్పుడు వాటి ధరలు పెరుగుతాయి. దాని సహజ గుణమైన తెలుపులోనే ఉంచి చేయడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు.. ధర కూడా తగ్గుతుంది కాబట్టి ఎలాంటి ఇతర రంగులు కలపకుండా దాన్ని అలాగే తయారు చేస్తున్నారు. అందుకే తెలుపు రంగులో మాత్రమే టాయిలెట్ సీట్లు ఉంటాయి.
Toilet Seats : వేరే రంగుల్లో ఉంటే వాటిపై పడే మురికి కనిపించదు
ఉదాహరణకు టాయిలెట్ సీట్లు నలుపు రంగులో ఉంటే.. వాటిపై పడే మురికి కనిపించదు. తెలుపు కాకుండా ఏ రంగుల్లో ఉన్నా వాటి మురికి కనిపించదు. అందుకే.. తెలుగు రంగులో ఉంటే మురికి వెంటనే కనిపిస్తుంది. టాయిలెట్ క్లీనర్స్ తో వాటిని శుభ్రం చేసుకోవచ్చు. సీటు శుభ్రం అయిందా లేదా అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. వేరే రంగుల్లో ఉంటే.. ఎంత శుభ్రం చేసినా వాటి మురికి పోయిందో లేదో కూడా తెలియదు. అందుకే.. వేరే రంగులతో కాకుండా తెలుపు రంగులోనే వాటిని తయారు చేస్తుంటారు.