Gadapa : ప్రతి ఇంటికి ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ కు ఒక గడప ఉంటుంది. అది చాలా పవిత్రం అని నమ్ముతారు జనాలు. ఎంతలా అంటే.. గుడిలో దేవుడిని పూజించినట్టుగా గడపను కూడా పూజిస్తారు. రోజూ గడపను అలంకరిస్తారు. పూలు పెడతారు. పసుపు, కుంకుమ పెడతారు. మరికొందరు అయితే ఏకంగా రంగురంగుల కలర్లతో అలంకరిస్తారు. ఇలా.. ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు తమ ఇంటి గడపలను అలంకరిస్తుంటారు. అయితే.. ఇంటి గడపను తొక్కొద్దు అంటారు. ఇంట్లోకి వెళ్లేటప్పుడు అయినా ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు అయినా గడపను తొక్కొద్దు అంటారు. గడప మీద కూర్చోవద్దు కూడా. అసలు.. ఎందుకు గడపను తొక్కొద్దు అంటారు. ఎందుకు దాని మీద కూర్చోవద్దు అంటారు. ముఖ్యంగా ఆడపిల్లలను అయితే అస్సలు గడపను తొక్కొద్దు అంటారు. దాని మీద కూర్చోవద్దు అంటారు. కానీ.. ఎందుకో మాత్రం కారణం తెలియదు.
నిజానికి గడపను మనం సింహ ద్వారంగా కొలుస్తాం. లక్ష్మీ ద్వారం అని కూడా పిలుస్తాం. అందుకే.. గడపకు పూజ చేస్తుంటాం. ఈ సంప్రదాయం నిన్నా, మొన్న వచ్చింది కాదు. ఎప్పటి నుంచో ఉంది. పండుగ రోజుల్లో కూడా గడపను మంచిగా అలంకరిస్తారు. కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. పసుపు రాస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందట. అలాగే.. దుష్టశక్తులు కూడా ఏవీ ఇంట్లోకి రావట. అందుకే అలా చేస్తారు.
Gadapa : గడపను లక్ష్మీదేవిగా భావించి పూజిస్తాం కాబట్టే తొక్కొద్దు అంటారు
గడపను లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు కాబట్టే గడపను తొక్కకూడదు అంటారు. పిల్లలను కూడా తొక్కొద్దు అంటారు. గడప మీద కూర్చోవడం లాంటివి కూడా అందుకే చేయకూడదు. ఇంటి ముందు ఉన్న ఒక్క గడపే కాదు.. ఏ గడప అయినా సరే.. దాన్ని తొక్కకూడదు. నిజానికి మనం ఇంటి ముందు ఉన్న ఒక్క గడపనే పూజిస్తాం. కుంకుమతో అర్చిస్తాం. అయినా కూడా ఇంట్లోని ఏ గడపను తొక్కొద్దు అంటారు. కనీసం దాని మీద కూర్చోవద్దు అంటారు. ఇంట్లోని ఏ గడప అయినా సరే.. లక్ష్మీదేవిలా భావించి తొక్కొద్దు అంటారు. అందుకే.. గడప మీద కూర్చోవడం, ఎలాంటి పనులు చేయడం కూడా వద్దు. కుదిరితే ప్రతి రోజు కాకపోయినా ప్రతి శుక్రవారం అయినా సింహద్వారానికి పసుపు, కుంకుమతో అలంకరిస్తే బెటర్.