Train Ticket : రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది రైలు ప్రయాణాలు చేసేవాళ్లు ఈ సమస్యను ఎదుర్కొంటారు. సడెన్ గా రైలు ప్రయాణం ఉంటే.. రిజర్వేషన్ టికెట్లు దొరక్కపోతే జనరల్ టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎవరినైనా రైళ్లలో పంపించడం కోసం రైల్వే స్టేషన్ కు వెళ్లినా అక్కడ ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాట్ ఫామ్ టికెట్ ఖచ్చితంగా రైల్వే స్టేషన్ లోకి ఎంట్రీ ఇస్తేనే తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ.. కొన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ల కౌంటర్ వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయాల్లో ఏం చేయాలి. రైలు అప్పటికే ప్లాట్ ఫామ్ మీదికి వస్తే ఎలా.. ఓవైపు ట్రెయిన్ కదిలే సమయం అవుతుంటే ఏం చేయాలి. జనరల్ టికెట్ తీసుకునే సమయం కూడా ఉండదు. టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కలేం. ఆ ట్రెయిన్ మిస్ అయితే ఇంకో ట్రెయిన్ దొరకదు. అటువంటి సమయాల్లో మనల్ని ఆదుకునేదే యూటీఎస్ యాప్.
Train Ticket : ఆన్ లైన్ లో యూటీఎస్ యాప్ ద్వారా టికెట్స్ తీసుకోవచ్చు
ఆన్ లైన్ లో యూటీఎస్ యాప్ ద్వారా టికెట్స్ తీసుకోవచ్చు. ట్రెయిన్ జనరల్, ప్లాట్ ఫామ్ టికెట్లను తీసుకునే చాన్స్ ఉంటుంది. యూటీఎస్ యాప్ రైల్వే శాఖ రూపొందించిన అధికారిక యాప్. ఈ యాప్ ద్వారా ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ కు వెళ్లాలో వివరాలు ఇచ్చి సెకండ్ క్లాస్ జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ టికెట్ ను టీసీకి చూపిస్తే సరిపోతుంది. జనాలు టికెట్ కౌంటర్ దగ్గర ఎక్కువ మంది ఉంటే.. రైలు కదిలే సమయంలో ఈ పని చేయొచ్చు. కాకపోతే టికెట్ బుక్ చేసుకున్న తర్వాతనే ట్రెయిన్ ఎక్కాల్సి ఉంటుంది. ట్రెయిన్ ఎక్కిన తర్వాత టికెట్ బుక్ కాదు. మీ లొకేషన్ ను బట్టి టికెట్ బుక్ అవుతుంది. అందుకే.. మీరు ఏ లొకేషన్ లో ఉన్నారో ఆ లొకేషన్ నుంచే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. ప్లాట్ ఫామ్ నుంచి టికెట్ తీసుకోలేరు. స్టేషన్ కు కొంచెం దూరం వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాట్ ఫామ్ కు దూరంగా వెళ్లి బుక్ చేసుకొని రైలు ఎక్కండి. యూటీఎస్ యాప్ మీ ఫోన్ లో ఉంటే.. రైలు జనరల్ టికెట్స్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.