Wife and Husband : భార్యాభర్తల బంధం అనేది చాలా విచిత్రమైన బంధం. ఆ బంధానికి ఏ పేరు పెట్టాలో ఎవ్వరికీ అర్థం కాదు. ఎందుకంటే.. ఈ సృష్టిలో ఏ బంధానికి కూడా విడాకులు తీసుకునే అవసరం లేదు. అసలు విడాకులు తీసుకునే చాన్స్ కూడా లేదు. కానీ.. ఒక్క బంధానికే చిన్న చిన్న కారణాలకు కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉంది. అదే భార్యాభర్తల బంధం. ఒక తండ్రి తన కొడుకుకు విడాకులు ఇవ్వగలడా? ఒక తల్లి తన కూతురుకు విడాకులు ఇవ్వగలదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బంధాలు ఉన్నాయి.. ఒక అన్న చెల్లికి విడాకులు ఇచ్చే ప్రొసీజన్ ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి.
కానీ.. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ వచ్చినా.. వాళ్లకు కలిసి ఉండటం ఇష్టం లేకపోయినా వెంటనే విడాకులు తీసుకోవచ్చు. అందుకే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కొన్ని సెక్షన్ల కింద భార్యాభర్తలు విడాకులు తీసుకుంటూ ఉంటారు. అయితే.. స్ట్రాంగ్ రీజన్స్ ఉంటేనే కొందరు విడాకులు తీసుకుంటారు. ఉదాహరణకు భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడమో.. లేదా భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడమో అలాంటి పెద్ద పెద్ద కారణాలకు విడాకులు అంటే ఎవ్వరైనా ఓకే అంటారు కానీ.. మీ భార్య లేదా భర్త.. రోజూ స్నానం చేయకపోయినా, శుభ్రతగా ఉండకపోవడం, వాళ్ల బాడీ నుంచి చెమట వాసన వచ్చినా కూడా విడాకులు తీసుకోవచ్చు.
Wife and Husband : చిన్న చిన్న కారణాలను కోర్టులు ఒప్పుకుంటాయా?
అయితే.. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి రైట్ టు లైఫ్ అని రైట్ ఉంటుంది. అంటే.. మనకు నచ్చినట్టుగా బతకడం. ఈ దేశంలో పుట్టినందుకు నీకు నువ్వుగా నీకు నచ్చినట్టుగా బతకొచ్చు. నీకు నచ్చని చోట నిన్ను ఉండమని ఎవ్వరూ బతిమిలాడలేరు. అదే కాన్సెప్ట్ భార్యాభర్తల మధ్య కూడా వర్తిస్తుంది.
ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అనే యాక్ట్ కింద విడాకులు తీసుకోవచ్చు. మీ భర్త లేదా భార్య రోజూ స్నానం చేయకుండా ఇంట్లో తిరుగుతూ మీకు ఇబ్బంది కలిగించడం, పరిశుభ్రంగా ఉండకపోవడం, వాళ్ల శరీరం నుంచి చెమట వాసన రావడం లాంటివి వస్తే అది రైట్ టు లైఫ్ అనే యాక్ట్ కి ఇబ్బంది కలిగించినట్టే. అందుకే ఆ యాక్ట్ కింద మీరు నిరభ్యంతరంగా మీ భర్త లేదా భార్యకు విడాకులు ఇవ్వొచ్చు. మీకు నచ్చినట్టుగా, నచ్చిన వారితో బతికే హక్కును మన రాజ్యాంగం కల్పిస్తోంది.