Indian Passport : మీకు పాస్ పోర్ట్ ఉన్నా లేకున్నా దేశమంతా తిరగొచ్చు. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు. ఈ దేశమంతా చుట్టి రావచ్చు. మిమ్మల్ని అడిగే వాళ్లే ఉండరు. ఒక్క ఆధార్ కార్డు పట్టుకొని దేశమంతా తిరిగేయొచ్చు. కానీ.. దేశం దాటి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందా? ఆధార్ కార్డు చూపిస్తే వేరే దేశం వెళ్లే చాన్స్ ఉంటుందా? వేరే దేశం వెళ్లాలంటే ఖచ్చితంగా పాస్ పోర్ట్ కావాల్సిందే కదా అంటారా? అవును.. మన దేశం దాటి వేరే దేశం వెళ్లాలంటే ఖచ్చితంగా పాస్ పోర్ట్ ఉండాల్సిందే. కానీ.. ఒక రెండు దేశాలకు మాత్రం ఎలాంటి పాస్ పోర్ట్ అవసరం లేదు. పాస్ పోర్ట్ అవసరం లేదు కానీ.. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడీ కార్డు ఉన్నా సరిపోతుంది. ఏదో ఒక ఐడీ కార్డుతో ఆ రెండు దేశాలకు వెళ్లొచ్చు.
ఇంతకీ ఆ రెండు దేశాలు ఏంటి అంటారా? అవి నేపాల్, భూటాన్. ఈ రెండు దేశాలకు భారత్ నుంచి వెళ్లేందుకు పాస్ పోర్ట్ అవసరం లేదు. కేవలం ఓటర్ ఐడీ కార్డు ఉంటే చాలు. భారత పౌరులకు ఈ రెండు దేశాలు ఎలాంటి పాస్ పోర్ట్ లేకున్నా వెళ్లొచ్చు. ఆ దేశాల బార్డర్ కు వెళ్లినప్పుడు మీ ఓటర్ ఐడీ చూపిస్తే చాలు లేదా ఆధార్ కార్డు చూపించినా చాలు.
Indian Passport : మీ దగ్గర పాస్ పోర్ట్ ఉంటే ఈ దేశాలకు వీసా లేకున్నా వెళ్లొచ్చు
మీ దగ్గర పాస్ పోర్ట్ ఉంటే ఈ దేశాలకు వీసా లేకున్నా వెళ్లొచ్చు. కొన్ని దేశాలు భారత పాస్ పోర్ట్ ఉంటే చాలు.. వాళ్ల దేశానికి రానిస్తాయి. ఎలాంటి వీసా కూడా అడగవు. కాకపోతే ఆ దేశ ఎయిర్ పోర్ట్ కి వెళ్లాక వీసా ఆన్ అరైవల్ అనే ఆప్షన్ ద్వారా వాలిడ్ పాస్ పోర్ట్ తో వాళ్ల దేశంలోకి రానిస్తారు. థాయిలాండ్, మకావ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, కెన్యా, మయన్మార్, ఖతర్, కాంబోడియా, ఉగండా, జింబాబ్వే, ఇరాన్ లాంటి 57 దేశాలు వీసా లేకున్నా తమ దేశానికి వచ్చేందుకు పర్మిషన్ ఇస్తాయి. ఇక.. నేపాల్, భూటాన్ మాత్రం ఆధార్ కార్డు ఉంటే చాలు.. పాస్ పోర్ట్ లేకున్నా తమ దేశాల్లోకి రానిస్తాయి. అందుకే మీ దగ్గర పాస్ పోర్ట్ లేకున్నా ఆధార్ కార్డుతో వెంటనే నేపాల్ లేదా భూటాన్ చెక్కేయండి.