YouTube: ప్రస్తుత కాలంలో ఎలాంటి వాటి గురించి తెలుసుకోవాలన్న కచ్చితంగా సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. అందువల్ల నేటి స్మార్ట్ కాలంలో సోషల్ మీడియాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ లాంటివి చాలానే ఉన్నాయి. యూట్యూబ్లో ప్రజలకు ఎలాంటి అవసరమైన వీడియో అయినా దొరుకుతుంది.
అలాంటి యూట్యూబ్ కు కొత్త ఫీచర్ వస్తోంది. చానెల్స్‌లోని వీడియోలను మూడు భాగాలుగా విభజిస్తుంది. ఇటీవలి కాలంలో యూట్యూబ్‌కు చాలా కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ కొత్త ట్యాబ్స్ సదుపాయాన్ని కూడా యూట్యూబ్ తీసుకొచ్చింది. ఈ ఫ్యూచర్ వల్ల యూట్యూబ్ ఛానల్ లో షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోలను సులువుగా గుర్తించవచ్చు.
ఇంకా ఈ యూట్యూబ్ కొత్త ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం.యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు సాధారణ లాంగ్ వీడియోస్, షార్ట్స్, లైవ్ వీడియోలు ఒకే పేజ్ లో కనిపిస్తాయి. దీనివల్ల చానల్స్ ను వెతకడనికి కూడా చాలా కష్టమవుతుంది.
దీనివల్ల యూట్యూబ్ ఒక కొత్త సదుపాయాన్ని చానల్ పేజీలో లాంగ్ వీడియోలకు, షార్ట్ వీడియోలకు లైవ్ వీడియోలకు వేరువేరుగా ట్యాబ్ లను ఏర్పాటు చేయనుంది.ఈ కొత్త సదుపాయం వల్ల ఏ ఛానల్లో లాంగ్ వీడియోలు ఉన్నాయో, ఏ ఛానల్ లో షార్ట్ వీడియోలు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు.
ఇంతకు ముందు వరకు వీడియో సెక్షన్ కింద ఇలాంటివన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివన్నీ వేరే వేరే ట్యాబ్స్ క్రిందికి వస్తాయి. చానల్స్ లో షార్ట్స్ వీడియోలు మాత్రమే చూడాలనుకునే వారు ఛానల్ పేజీ లోకి వెళ్లి షార్ట్స్ ట్యాబ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.
లాంగ్ వీడియోలు కావాలనుకుంటే ఆ ట్యాబ్‌లోకి వెళ్లవచ్చు. ఇది యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ , ఐఓఎఎస్ యూట్యూబ్ యాప్స్‌తో పాటు వెబ్ వెర్షన్‌లోనూ వరుసగా లాంగ్ వీడియో ట్యాబ్, తర్వాత షార్ట్స్, లైవ్ ట్యాబ్స్ ఉంటాయి.
ఇప్పటికే ఈ సరికొత్త ట్యాబ్స్ ఫీచర్‌ను ఏర్పాటు చేయడానికి యూట్యూబ్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొందరికి ఈ కొత్త అప్‌డేట్ వచ్చింది. ఇంకా అప్డేట్ రాని వారికి అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది.మరోవైపు, యూట్యూబ్‌లో చానెల్ పేజీ వివరాల లుక్‌ను కూడా యూట్యూబ్ మారుస్తోంది.
లైక్, డిస్‌లైక్, షేర్ బటన్స్ లుక్ కాస్త కొత్తగా కనిపించే అవకాశం ఉంది. అలాగే యూట్యూబ్‌లో డార్క్ మోడ్ మరింత డార్క్‌గా కనిపిస్తోంది. ఇందుకోసం యాంబియెంట్ మోడ్‌ను యూట్యూబ్ తీసుకువస్తుంది. యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫ్యూచర్లు చాలామంది యూట్యూబర్లకు ఉపయోగం కలిగించే విధంగా ఉన్నాయని కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.